రంగన్న గుడిలో రేపు వైష్ణవ శ్రీకృష్ణ జన్మాష్టమి

SRPT: కోదాడ పట్టణంలోని రంగన్న గుడిలో సోమవారం వైష్ణవ శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా కృష్ణ భగవానుడికి ఉదయం అభిషేకాలు, ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ఆదివారం ఆలయ ప్రధాన అర్చకులు రాఘవాచార్యులు తెలిపారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరారు. సాయంత్రం 6 గంటలకు ఉట్టి కొట్టే కార్యక్రమం కూడా ఉంటుందని తెలియజేశారు.