యువతి అదృశ్యంపై కేసు నమోదు
AKP: నక్కపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఉద్దండపురం గ్రామానికి చెందిన యువతి అదృశ్యం అయింది. ఈనెల 16వ తేదీ నుంచి కనిపించడం లేదని ఆమె తండ్రి ఈశ్వరరావు నక్కపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. బంధువుల ఇళ్లల్లోను చుట్టుపక్కల ప్రాంతాల్లోనూ వెతికినా ఆచూకీ లభ్యం కాలేదని తండ్రి తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై సన్నిబాబు తెలిపారు.