సహజవనరుల పరిరక్షణ అందరి లక్ష్యం కావాలి: కమిషనర్

HYD: సహజ వనరుల పరిరక్షణ అందరి లక్ష్యంగా ఉండాలని హైడ్రా కమిషనర్ రంగనాథ్ సూచించారు. అలా చేస్తేనే మెరుగైన జీవనం సాధ్యమని చెప్పారు. శుక్రవారం HYD హైడ్రా కార్యాలయంలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో జాతీయ జెండా ఆవిష్కరించిన అనంతరం మాట్లాడారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 51ఏ(జీ)లో సహజ వనరుల సంరక్షణ ప్రస్తావించబడిందన్నారు.