వ్యవసాయ మార్కెట్ ఆధునికీకరణకు రూ. 6.80 కోట్లు

ఖమ్మం: వ్యవసాయ మార్కెట్ ఆధునికీకరణకు ప్రభుత్వం అదనంగా రూ. 6.80 కోట్లు మంజూరు చేసింది. ఈ మేరకు రాష్ట్ర సహకార, మార్కెటింగ్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్, చేనేతశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఇప్పటికే రూ. 148.50 కోట్లు మంజూరు చేయించిన విషయం తెలిసిందే. ఇప్పుడు నిర్మాణ పనులకు మొత్తం రూ. 155.30 కోట్లను ప్రభుత్వం మంజూరు చేసింది.