నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం

ASF: కాగజ్‌నగర్ పట్టణంలో బుధవారం విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని పట్టణ ఏఈ కమలాకర్ ఒక ప్రకటనలో తెలిపారు. విద్యుత్ లైన్ మెయింటెనెన్స్, తీగల కింద చెట్ల తొలగింపు కారణంగా పట్టణంలోని గుంటూరు కాలనీ, సర్ సిల్క్, దాదానగర్ కాలనీలకు ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటలకు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు పేర్కొన్నారు. కావున వినియోగాలు గమనించి సహకరించాలని కోరారు.