నేడు 25 బ్యాంకుల నిర్మాణాలకు శంకుస్థాపన
AP: అమరావతిలో ఇవాళ 25 బ్యాంకులు, ప్రభుత్వ రంగ సంస్థల ప్రధాన కార్యాలయాల నిర్మాణానికి కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ శంకుస్థాపన చేయనున్నారు. ఈ కార్యక్రమానికి సీఎం చంద్రబాబు, Dy. CM పవన్, మంత్రులు లోకేష్, నారాయణ హాజరుకానున్నారు. ఉదయం 10 గంటలకు రాజధాని సీడ్ యాక్సెస్ రోడ్డు పక్కన సీఆర్డీఏ ప్రాజెక్టు కార్యాలయం వద్ద మొదటి బ్లాక్‌లో కార్యక్రమం జరగనుంది.