కుటుంబ కలహాలతో వ్యక్తి ఆత్మహత్య

కుటుంబ కలహాలతో వ్యక్తి ఆత్మహత్య

KRNL: ఆదోని మం. బైచిగేరి గ్రామానికి చెందిన వీర హుసేన్ (25) నిన్న ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఏడు సంవత్సరాల క్రితం ఎమ్మిగనూరుకు చెందిన చాకలి శాంతితో వివాహం జరిగింది. కుటుంబ కలహాల కారణంగా భార్య శాంతి గత మూడు సంవత్సరాలుగా పుట్టింట్లోనే ఉంటోంది. పెద్దలు పంచాయతీలు చేసినా ఆమె రాకపోవడంతో మనస్తాపం చెందిన వీర హుసేన్ ఈ దారుణానికి పాల్పడ్డాడు.