శ్రీ రావాలమ్మ తల్లి పండుగ మహోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే

VZM: కొత్తవలస మండలం, రాజపాత్రునిపాలెంలో శ్రీ రావాలమ్మ తల్లి పండుగ మహోత్సవ కార్యక్రమంలో ఎస్.కోట ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి గురువారం పాల్గొన్నారు. విశాఖ పార్లమెంటు తెలుగు యువత ఉపాధ్యక్షులు లెంక శ్రీను ఆహ్వానం మేరకు గ్రామ రావాలమ్మ తల్లి పండుగ మహోత్సవానికి ఎమ్మెల్యే హాజరయ్యారు. ఈసందర్బంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.