భారీ నష్టాల్లో కొనసాగుతున్న స్టాక్ మార్కెట్లు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఇవాళ భారీ నష్టాల్లో కొనసాగుతున్నాయి. మధ్యాహ్నం సెన్సెక్స్ 1,680.13 పాయింట్లు క్షీణించి 75,024.00 వద్ద ట్రేడ్ అవుతోంది. నిఫ్టీ 530.40 పాయింట్లు పతనమై 23,247.40 వద్ద కదలాడుతోంది. రూపాయి జీవనకాల కనిష్టాలకు పడిపోయింది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.92.89గా ఉంది.