పుస్తక మహోత్సవాన్ని ప్రారంభించిన మంత్రి, ఎంపీ

ప్రకాశం: ఒంగోలులోని పీవీఆర్ బాయ్స్ హై స్కూల్ లో ఏర్పాటు చేసిన 3వ పుస్తక మహోత్సవాన్ని శుక్రవారం మంత్రి డాక్టర్ బాలవీరాంజనేయ స్వామి, ఎంపీ మాగుంట శ్రీనివాసుల రెడ్డిలు ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. నేటి సాంకేతిక యుగంలో అందరూ పఠనాసక్తిని కోల్పోతున్నారని, ఇటువంటి తరుణంలో పుస్తక మహోత్సవాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు.