ఏనుగుల దాడిలో రైతు మృతి బాధాకరం: పవన్ కళ్యాణ్

CTR: అవులపల్లె పంచాయతీ కొత్తూరుకు చెందిన రైతు రామకృష్ణంరాజు ఏనుగుల గుంపు దాడిలో దుర్మరణం పాలైన విషయం తెలుసుకొని డిప్యూటీ CM పవన్ కళ్యాణ్ చింతించారు. బాధాకరమైన ఈ ఘటనకు సంబంధించిన వివరాలను అటవీశాఖ అధికారుల నుంచి తెలుసుకున్నారు. ఏనుగుల గుంపు వెళ్తున్న మార్గాలను ఎప్పటికప్పుడు ట్రాక్ చేస్తూ, ఆయా ప్రాంతాల రైతులకు ముందుగా సమాచారం అందించాలని అధికారులను సూచించారు.