వికసిత్ కృషి సంకల్ప అభియాన్ కార్యక్రమం

వికసిత్ కృషి సంకల్ప అభియాన్ కార్యక్రమం

SKLM: బూర్జ మండలంలోని చీడివలసలో కృషి విజ్ఞాన కేంద్రం, వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో వికసిత్ కృషి సంకల్ప అభియాన్ కార్యక్రమం సోమవారం నిర్వహించారు. భారత వ్యవసాయ పరిశోధన మండలి వాణిజ్య పంటల పరిశోధనా స్థానం రాజమండ్రి శాస్త్రవేత్త శైలజ పాల్గొని వరిలో వచ్చే చీడపీడల సమగ్ర సస్యరక్షణను రైతులకు వివరించారు. మట్టి పరీక్షలు చేయటం ద్వారా రైతులుకు ప్రయోజనం చేకూరుతుందని తెలిపారు.