పార్టీ కోసం పనిచేసిన వారికే ప్రాధాన్యత

పార్టీ కోసం పనిచేసిన వారికే ప్రాధాన్యత

NZB: పార్టీ కోసం కష్టపడి పనిచేసినవారికి పదవుల్లో మొదటి ప్రాధాన్యత ఉంటుందని ఎమ్మెల్యే సుదర్శన్‌ రెడ్డి అన్నారు. ఎడపల్లిలో మంగళవారం నిర్వహించిన పార్టీ నియోజకవర్గ కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడారు. వచ్చే స్థానిక ఎన్నికల్లో పార్టీ విజయమే లక్ష్యంగా కార్యకర్తలు పనిచేయాలని సూచించారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్, తాహెర్‌బిన్‌ హందాన్ ఉన్నారు.