ఆరోగ్యంగానే ఇరాన్ సుప్రీం లీడర్
ఇరాన్ నూతన సుప్రీం లీడర్‌గా ఇటీవల నియమితులైన మొజ్తాబా ఖమేనీ ఆరోగ్యంగానే ఉన్నట్లు అధ్యక్షుడు మసూద్ కుమారుడు వెల్లడించారు. అమెరికా-ఇజ్రాయెల్ దాడుల్లో మొజ్తాబా ఖమేనీ గాయపడినట్లు ఇటీవల వార్తలొచ్చిన విషయం తెలిసిందే. ఆయన ఆరోగ్యంపై పలు ఊహాగానాలు చెలరేగాయి. ఈ నేపథ్యంలో మొజ్తాబా బాగానే ఉన్నాడని, ఆయనతో టచ్‌లో ఉన్న తన స్నేహితులు చెప్పినట్లు యూసఫ్ పెజెష్కియాన్ తెలిపారు.