ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేసిన ఎమ్మెల్యే

ASR: ముంచంగిపుట్ మండలంలోని సామాజిక ఆసుపత్రిని శుక్రవారం మధ్యాహ్నం జెడ్పీ చైర్‌పర్సన్ సుభద్రతో కలిసి అరకులోయ ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆసుపత్రి రికార్డులను పరిశీలించారు. అనంతరం రోగులకు అందిస్తున్న వైద్య సదుపాయాల గురించి ఎమ్మెల్యే డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు.