కియ కార్ల తరలింపునకు డబుల్ డెక్కర్ గూడ్స్ రైలు

సత్యసాయి: పెనుకొండలోని కియ పరిశ్రమ నుంచి కార్ల తరలింపు కోసం ప్రత్యేకంగా డబుల్ డెక్కర్ గూడ్స్ రైలును ఏర్పాటు చేశారు. ఇక్కడ తయారైన కార్లను దేశ, విదేశాలకు తరలిస్తుంటారు. ఇప్పటి వరకూ ఒక విడతలో సింగిల్ వ్యాగన్‌ల ద్వారా వంద కార్లను తరలించేవారు. తాజాగా పెనుకొండ రైల్వే జంక్షన్ మీదుగా డబుల్ డెక్కర్ గూడ్స్ వ్యాగన్ ద్వారా 264 కార్లను ఢిల్లీకి తరలించారు.