VIDEO: 'మైనారిటీ సోదరుల ప్రయోజనాల కోసం కృషి చేస్తా'
కృష్ణా: గుడివాడలో మైనార్టీ సోదరుల ప్రయోజనాలకు ప్రాధాన్యతనిస్తూ, వారి అభ్యున్నతికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానని ఎమ్మెల్యే రాము అన్నారు. రాష్ట్రంలోని మసీదుల ఇమామ్లకు ప్రభుత్వం 12 నెలల గౌరవ వేతనాలను విడుదల చేయడంతో గుడివాడ టీడీపీ కార్యాలయంలో మైనార్టీ నాయకులు థాంక్యూ సీఎం సార్ కార్యక్రమం ఈరోజు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేను సత్కరించారు.