విద్యార్థులకు ఉచిత దుస్తుల పంపిణీ
NZB: నందిపేట్ మండలం కౌల్‌పూర్ గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో ఆ గ్రామ వాసి ప్రేమసాగర్ పాఠశాలలోని 49 మంది విద్యార్థులకు ఉచితంగా రూ. 15,000 విలువైన T SHIRTS పంపిణీ చేశారు. తమ గ్రామంలోని పాఠశాల విద్యార్థులకు సొంత ఖర్చులతో దుస్తులు పంపిణీ చేయడం సంతోషకరమని సాగర్ చెప్పారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రనగర్ గురుస్వామి, హెచ్ఎంలు నరేశ్ కుమార్, అన్నపూర్ణ పాల్గొన్నారు.