రాష్ట్రంలో ప్రత్యేక అధికారుల నియామకం
AP: రాష్ట్రవ్యాప్తంగా 11 మున్సిపల్ కార్పొరేషన్లు, 75 మున్సిపాలిటీలు, నగరపంచాయతీలకు ప్రభుత్వం ప్రత్యేక అధికారులను నియమించింది. ఇవాళ్టి నుంచి 6 నెలలు లేదా ప్రజాప్రతినిధులు ఎన్నికయ్యేవరకు ప్రత్యేక అధికారులు పాలన సాగించనున్నారు. విశాఖ, విజయవాడ, గుంటూరు, తిరుపతి, కడప, కర్నూలు, అనంతపురం, ఒంగోలు, విజయనగరం, మచిలీపట్నం, చిత్తూరు కార్పొరేషన్లలో ప్రత్యేక అధికారుల పాలన జరగనుంది.