VIDEO: కాపురానికి భార్య రాకపోవడంతో భర్త ఆత్మహత్యాయత్నం
WGL: వర్ధన్నపేట మండలం దమ్మన్నపేట గ్రామంలో భార్య కాపురానికి రావడం లేదన్న మనస్థాపంతో భర్త మహాకాళి రాజు పురుగుల మందు సేవించి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. కుటుంబ సభ్యులు గమనించి వెంటనే అతడిని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.