భర్తకు ప్రేమతో.. 40 శాతం కాలేయం ఇచ్చి

భర్తకు ప్రేమతో.. 40 శాతం కాలేయం ఇచ్చి

పెళ్లైన వారానికే భర్తను భార్యలు చంపుతున్న ఈ రోజుల్లో ఓ సతీమణి కట్టుకున్న వాడికి తన 40 శాతం కాలేయాన్ని ఇచ్చి బ్రతికించుకుంది. ఈ ఘటన రాజస్థాన్‌లో జరిగింది. జైపూర్ సవాయ్ సింగ్ వైద్య కళాశాల ఆసుపత్రి వైద్యులు 15 గంటలు శ్రమించి శస్త్ర చికిత్సను విజయవంతం చేశారు. దంపతులిద్దరూ ఆరోగ్యంగా ఉన్నట్లు చెప్పారు. ఈ చికిత్సకు రూ.20 నుంచి 25 లక్షలవుతుందని, కానీ ఉచితంగా చేసినట్లు తెలిపారు.