రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు: మంత్రి

కృష్ణా: పింఛను పంపిణీలో అనేక జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు మంత్రి పార్థసారథి తెలిపారు. లబ్దిదారులకు ఇబ్బంది లేకుండా పింఛను అందించే బాధ్యత అధికారులదేనని చెప్పారు. అమరావతిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అకాల వర్షాలు, పంట నష్టంపై సీఎం సమీక్ష నిర్వహించారని, కొన్ని చోట్ల ధాన్యం తడిసినట్లు కలెక్టర్లు సీఎం దృష్టికి తీసుకెళ్లారని చెప్పారు.