టీ స్టాల్ గొడవ నుంచి సస్పెన్షన్ వరకూ సీఐపై మళ్లీ ఫిర్యాదు
PLD: కారంపూడి పోలీస్ స్టేషన్ సీఐ చిన్న మల్లయ్యపై చప్పిడి రాము ఆదివారం మరోసారి ఫిర్యాదు చేశారు. గతంలో టీ స్టాల్ వద్ద దురుసుగా ప్రవర్తించి, రివాల్వర్‌తో బెదిరించిన ఘటనపై ఇప్పటికే మంత్రి లోకేష్‌కు ఫిర్యాదు చేయగా, సీఐ సస్పెండ్ అయినట్లు సమాచారం. అయితే, అలాంటి అధికారిని పూర్తిగా తొలగించాలని డిమాండ్ చేస్తూ తాజాగా ఎస్సై వాసుకు మళ్లీ ఫిర్యాదు చేశారు.