రోడ్డుపై గుంతలు.. ఇబ్బందుల్లో వాహనదారులు

రోడ్డుపై గుంతలు.. ఇబ్బందుల్లో వాహనదారులు

SRCL: చందుర్తి మండలం మర్రిగడ్డ గ్రామంలోని ఎల్లమ్మ ఆలయం సమీపంలో రోడ్డుపై గుంతలు పడి వాహనదారులు ఇబ్బందులకు గురవుతున్నారు. ఇటీవల కురిసిన వర్షాలకు రోడ్డుపై నీరు నిలిచి గుంతలు ఏర్పడ్డాయి. కోరుట్ల, వేములవాడ ప్రధాన రహదారి కావడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. ఆర్ అండ్ బి అధికారులు రోడ్డుపై ఉన్న గుంతలను పూడ్చివేయాలని వాహనదారులు కోరుతున్నారు.