నేడు ఎమ్మెల్యే పర్యటన వివరాలు
MHBD: బయ్యారం మండలంలో ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య సోమవారం పర్యటించనున్నారు. మధ్యాహ్నం కోదండరామయ్య ఫంక్షన్ హాల్‌లో లబ్ధిదారులకు సీఎం సహాయ నిధి చెక్కులు పంపిణీ చేయనున్నారు. అనంతరం పీఏసీఎస్ ఆధ్వర్యంలో మొక్కజొన్న కొనుగోళు కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ స్నేహ శబరిష్‌తో కలిసి ప్రారంభించనున్నారు.