మాజీ సీఎం జగన్‌పై పట్టాభిరామ్ తీవ్ర విమర్శలు
GNTR: మాజీ సీఎం జగన్‌పై స్వచ్ఛాంధ్ర కార్పోరేషన్ ఛైర్మన్ పట్టాభిరామ్ తీవ్ర విమర్శలు చేశారు. మంగళగిరిలోని NTR భవన్లో అమరావతిపై జగన్ చేసిన వ్యాఖ్యలకు సంబంధించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా మీడియా మాట్లాడారు. జగన్ అమరావతిపై కడుపు మంటతో కొత్త నాటకానికి తెర తీశారని అన్నారు. CRDA మ్యాప్ చూస్తే చంద్రబాబు విజన్ జగన్‌కు అర్థమవుతుందన్నారు.