'నా పోలీస్ - నా పోలీస్ స్టేషన్' కార్యక్రమానికి శ్రీకారం

'నా పోలీస్ - నా పోలీస్ స్టేషన్' కార్యక్రమానికి శ్రీకారం

E.G: వార్షిక తనిఖీల్లో భాగంగా రాజమహేంద్రవరం టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం 'నా పోలీస్ - నా పోలీస్ స్టేషన్' అనే నూతన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఎస్పీ నరసింహ కిషోర్ మాట్లాడుతూ.. ఈ కార్యక్రమం ద్వారా గ్రామ, వార్డు మహిళా పోలీసులు ప్రజల వద్దకు నేరుగా వెళ్లి వారి సమస్యలను అడిగి తెలుసుకుని, తక్షణమే పరిష్కరించే దిశగా చర్యలు చేపడతారని తెలిపారు.