శ్రీవారి దర్శనానికి క్యూ కట్టిన భక్తులు

శ్రీవారి దర్శనానికి క్యూ కట్టిన భక్తులు

CTR: నూతన సంవత్సరం సందర్భంగా గురువారం పుంగనూరు పట్టణం మినీ బైపాస్ లోని శ్రీ కళ్యాణ వెంకటరమణ స్వామి ఆలయంలో భక్తులు క్యూ కట్టారు. వేకువ జామునే అర్చకులు శ్రీవారిని సుప్రభాత సేవతో మేల్కొల్పి పూజాది కైంకర్యాలను నిర్వహించారు. భక్తుల దర్శనార్థం శ్రీవారి ఉత్సవమూర్తులను అలంకరించి అద్దాల మండపంలో కొలువు తీర్చారు.