అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు
TPT: పిచ్చాటూరు మండలంలో పేకాట, గంజాయి విక్రయాలు, మాదకద్రవ్యాల రవాణా వంటి చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్సై రాఘవేంద్ర హెచ్చరించారు. యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని సూచించారు. ఎక్కడైనా ఇటువంటి కార్యకలాపాలు జరుగుతున్నట్లు తెలిసినా వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు. వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని తెలిపారు.