రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైన విద్యార్థి
సిరిసిల్లలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన 9వ తరగతి విద్యార్థి ధనుష్ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో జరగనున్న రాష్ట్రస్థాయి ఫుట్‌బాల్ పోటీలకు ఎంపికయ్యాడని ప్రధానోపాధ్యాయురాలు శారద తెలిపారు. ఈ పోటీలు నల్గొండలోని సాగర్ రోడ్ డాన్ బాస్కో అకాడమీలో ఈనెల 14 నుంచి 16 వరకు జరుగుతాయని పేర్కొన్నారు. విద్యార్థిని పలువురు అభినందించారు.