మోదీ అధ్యక్షతన CCS సమావేశం
ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన CCS సమావేశంలో ఇరాన్-అమెరికా యుద్ధ ప్రభావంపై కీలక చర్చలు జరిగాయి. దేశంలో 60 రోజులకు సరిపడా చమురు నిల్వలు ఉన్నాయని స్పష్టం చేసింది. ఖరీఫ్ సీజన్‌కు ఎరువుల కొరత లేదని భరోసా ఇచ్చింది. గల్ఫ్ నుంచి ఇప్పటివరకు 5.98 లక్షల మంది భారతీయులు సురక్షితంగా వెనక్కి రాగా, అక్కడ ఉన్న విద్యార్థుల చదువుకు ఆటంకం కలగకుండా చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించింది.