ఎన్నికలు.. పుదుచ్చేరిలో పొత్తుల కుమ్ములాట

ఎన్నికలు.. పుదుచ్చేరిలో పొత్తుల కుమ్ములాట

పుదుచ్చేరిలో ఎన్నికల నగారా మోగడంతో రాజకీయ వేడి రాచుకుంది. NDA కూటమిలో సీట్ల పంపకాల విషయం పెద్ద తలనొప్పిగా మారింది. BJPకి 14, AINRCకి 16 సీట్ల పంపకం పూర్తయినా అభ్యర్థుల ఎంపికలో గందరగోళం నెలకొంది. మరో వైపు కాంగ్రెస్, DMK కూటమిలో సీట్ల విషయంలో ఒకతాటి పైకి రాలేకపోతున్నాయి. దీంతో కాంగ్రెస్, TVKతో వెళ్తామని DMKను హెచ్చరిస్తోంది. CPM, CPI తమకు 4 సీట్లు కావాలని కోరుతున్నాయి.