యూరియా కోసం పరుగులు పెట్టిన రైతులు

JN: జనగామ జిల్లాలోని స్టేషన్ ఘనపూర్ మండలం శివునిపల్లిలో బుధవారం యూరియా కోసం రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. విక్రయదారులు రైతులను తప్పుదోవ పట్టించడంతో, వారు ప్రధాన రహదారిపై ఆందోళనగా పరుగులు తీశారు. అగ్రోస్ సెంటర్ వద్ద టోకెన్లు తీసుకున్న రైతులకు మాత్రమే యూరియా పంపిణీ చేయడంతో, మిగిలిన రైతులు గంటల తరబడి క్యూలైన్లలో నిలబడాల్సి వచ్చింది.