VIDEO: బస్సులు ప్రారంభించిన మంత్రి పార్థసారథి

కృష్ణా: నూజివీడు మండలం మీర్జాపురం వద్ద అమరావతి నిర్మాణానికి హాజరయ్యే ప్రజల కోసం 150 బస్సులను శుక్రవారం ఏర్పాటు చేశారు. రాష్ట్ర గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి బస్సులను జండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అంతర్జాతీయ స్థాయిలో రాష్ట్ర రాజధాని అమరావతి నిర్మాణం పనులు ప్రధాని మోడీ ప్రారంభిస్తున్నట్లు చెప్పారు.