చేపల వేటకు వెళ్ళి యువకుడి మృతి

చేపల వేటకు వెళ్ళి యువకుడి మృతి

W.G: మొగల్తూరు (M) కోమటితిప్ప గ్రామానికి చెందిన తిరుమాని రాము (19) చేపల వేటపై ఆధారపడి జీవిస్తున్నాడు. ఆదివారం ఉదయం వేట కోసం ఉప్పుటేరు కాలువకు వెళ్లిన రాము ఇంటికి తిరిగిరాలేదు. కుటుంబ సభ్యులు గాలించినా రాము ఆచూకి లభ్యం కాలేదు. సోమవారం కాళీపట్నం ఈస్ట్‌ని లాంచీల రేవు వద్ద రాము మృతదేహం లభ్యమైంది. కుమారుడి మృతితో తల్లిదండ్రుల ఆర్తనాదాలు ఆకాశాన్నంటాయి.