సోమందేపల్లిలో జనసేన నాయకుల సమావేశం

సత్యసాయి: సోమందేపల్లిలో జనసేన నాయకులు ఆదివారం ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. జనసేన మండల కన్వీనర్ జేబీహుల్ల మాట్లాడుతూ.. సెప్టెంబర్ 2న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు సోమందేపల్లి పెద్దమ్మ గుడి దగ్గర అంగరంగ వైభవంగా జరుపుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర చేనేత కార్యదర్శి ఎర్రస్వామి, సీనియర్ నాయకులు మహేష్, భాషా పాల్గొన్నారు.