VIDEO: చెట్టు నుంచి పడి గీత కార్మికుడు మృతి
KMM: కల్లూరు మండలం రఘునాథగూడెం గ్రామంలో తాటి చెట్టు నుంచి కిందపడడంతో గీత కార్మికుడు మృతి చెందాడు. గ్రామానికి చెందిన బండి నరసింహారావు (45) తాటి కల్లు తీసేందుకు చెట్టు ఎక్కిన సమయంలో నడుముకు కట్టుకున్న మోకు సిల్ల తప్పడంతో కిందపడి మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. మృతుడికి భార్య, కుమారుడు ఉన్నారు. సర్పంచ్ సుధారాణి బాధిత కుటుంబాన్ని పరామర్శించారు.