భద్రగిరి సీహెచ్‌సీని సందర్శించిన రాష్ట్ర బృందం

భద్రగిరి సీహెచ్‌సీని సందర్శించిన రాష్ట్ర బృందం

PPM: భద్రగిరి సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని శనివారం NQAS (నేషనల్ క్వాలిటీ అస్యూరెన్స్ స్టాండర్డ్స్) రాష్ట్ర బృందం సందర్శించింది. బృందంలోని వైద్యులు రవికుమార్, ఆదిలక్ష్మి ఆసుపత్రిలో అందుతున్న వైద్య సేవలను పరిశీలించారు. రోజు వారీ ఓపీ నమోదు వివరాలు, మందుల నిల్వలు తదితర అంశాలను వైద్య సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో సూపరింటెండెంట్ అనిల్, వైద్యులు ఉన్నారు.