చెరువును తలపిస్తున్న వెంకన్నపాలెం రోడ్డు

VSP: వెంకన్నపాలెం(అంబేరపురం) వద్ద అనకాపల్లి-చోడవరం ప్రధాన రహదారి చిన్న వర్షానికే చెరువులా మారుతోంది. కొత్తగా వేసిన ఈ రోడ్డు ఆరు నెలలకే దెబ్బతినడం పట్ల కాంట్రాక్టర్ల పనితీరుపై స్థానికులు మండిపడుతున్నారు. ప్రయాణికులు ప్రమాద భయంతో ప్రయాణిస్తున్నారు. సంబంధిత అధికారులు జోక్యం చేసుకొని రోడ్డుకు మరమ్మతులు చేపట్టాలని పలువురు వాహనదారులు కోరుతున్నారు.