సర్పంచ్ బరిలో ఉన్నత విద్యావంతుడు పోటీ
ADB: నార్నూర్ మండలంలోని బాబేఝరీ గ్రామపంచాయతీ సర్పంచ్ స్థానానికి బీటెక్ పూర్తి చేసిన ఉన్నత విద్యావంతుడు కుమ్ర కిరణ్ కుమార్ బరిలోకి నిలిచారు. గ్రూప్స్ పరీక్షలకు ప్రిపేర్ అవుతూ సొంత గడ్డపై పోటీ చేసి ప్రజలకు సేవ చేయడమే లక్ష్యమంటూ ఆయన ముందుకు సాగుతున్నారు. గ్రామాల అభివృద్ధి, ప్రజల సమస్యల పరిష్కారమే ప్రధాన ధ్యేయమని పేర్కొన్నారు.