రేపు విద్యుత్ సరఫరాకు అంతరాయం

RR: షాద్ నగర్ నియోజకవర్గం కొత్తూరు మున్సిపాలిటీలో రేపు విద్యుత్ సరఫరాకు అంతరాయం కలుగుతుందని ఏఈ రమేష్ గౌడ్ తెలిపారు. శనివారం వారు మాట్లాడుతూ..11 కేవీ విద్యుత్ ఉపకేంద్రంలో మరమ్మతుల కారణంగా రేపు ఉదయం 10:30 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు పేర్కొన్నారు. విద్యుత్ వినియోగదారులు గమనించి సహకరించాలని కోరారు.