జగనన్న కాలనీలు కాదు ఊర్లు నిర్మించారు: కాకాణి

జగనన్న కాలనీలు కాదు ఊర్లు నిర్మించారు: కాకాణి

NLR: గత వైసీపీ ప్రభుత్వంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి జగనన్న కాలనీల పేర్లతో ఊర్లు నిర్మించారని మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి అన్నారు. మంగళవారం వెంకటాచలంలోని జగనన్న కాలనీని పరిశీలించారు. కూటమి ప్రభుత్వం పేదల సొంతింటి కలను నిర్లక్ష్యం చేస్తుందన్నారు. గత ప్రభుత్వంలో నిర్మించిన ఇళ్లపై చంద్రబాబు అసత్య ప్రచారాలు చేస్తున్నారన్నారు.