అవార్డు గ్రహీత.. అవినీతి బాట..!
MHBD: విలువలు బోధించాల్సిన ఉపాధ్యాయుడే అవినీతి ఊబిలో కూరుకుపోయారు. జిల్లాలోని గూడూరు ఇన్‌ఛార్జ్ ఎంఈవో రవికుమార్ లంచం తీసుకుంటూ ఇవాళ ACB అధికారులకు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డ విషయం తెలిసిందే. ఇటీవల 'ఉత్తమ ఉపాధ్యాయ' అవార్డు అందుకున్న రవికుమార్ ఇలా లంచం తీసుకుంటూ పట్టుబడటం విద్యాశాఖలో చర్చనీయాంశమైంది.