వైసీపీ నుంచి జనసేనలోకి చేరికలు

AKP: అచ్యుతాపురం మండలం అప్పన్నపాలెంకు చెందిన ఇద్దరు వైసీపీ వార్డు మెంబర్లు, పలువురు కార్యకర్తలు ఆదివారం జనసేన పార్టీలోకి చేరారు. ఎమ్మెల్యే కార్యాలయంలో ఎలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ సమక్షంలో వీరంతా జనసేన తీర్థం పుచ్చుకున్నారు. వారందరికీ ఎమ్మెల్యే కండువాలు వేసి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. రానున్న రోజుల్లో వైసీపీ కనుమరుగు కావడం ఖాయమన్నారు.