చేపల వేట నిలిపివేతపై మత్స్యకారుల వినతి
విశాఖలో ఫిబ్రవరి 14 నుంచి 21 వరకు ఎనిమిది రోజుల పాటు ఫ్లీట్ రివ్యూ సందర్భంగా సముద్రంలో చేపల వేటకు వెళ్లకూడదని మత్స్యశాఖ, నౌకాదళ అధికారులు ఆంక్షలు విధించారు. దీంతో ఉపాధి కోల్పోయే పరిస్థితి ఏర్పడిందని మత్స్యకారులు ఆందోళన వ్యక్తం చేశారు. పెదజాలారిపేట గ్రామ పెద్దలు జిల్లా కలెక్టర్‌కు, మత్స్యశాఖ జాయింట్ డైరెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు.