ముగిసిన జిల్లా స్థాయి వాలీబాల్ పోటీలు

ముగిసిన జిల్లా స్థాయి వాలీబాల్ పోటీలు

NLG: కనగల్ మండల కేంద్రంలో రెండు రోజులుగా జరుగుతున్న ఉమ్మడి నల్లగొండ జిల్లా స్థాయి వాలీబాల్ పోటీలు బుధవారం ముగిసాయి. టైటిల్‌ను చిట్యాల జట్టు కైవసం చేసుకుంది. కనగల్లు జట్టు రన్నరప్‌గా నిలిచింది. మూడు నాలుగు స్థానాల్లో నల్లగొండ ఎన్జీ కాలేజీ జట్టు ముకుందాపురం జట్లు నిలిచాయి. విజేత జట్లకు బహుమతులను ప్రధానం చేశారు.