రక్తదానం ప్రాణదానంతో సమానం: ఎమ్మెల్యే
ELR: పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవ కార్యక్రమాల్లో భాగంగా సోమవారం చింతలపుడిలో పోలీస్ శాఖ రక్తదాన శిబిరాన్ని నిర్వహించింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే సొంగా రోషన్ కుమార్ పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ.. రక్తదానం చేయడం ప్రాణదానం చేయడంతో సమానమని అన్నారు. ఇంతటి మంచి ఆలోచన చేసి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న పోలీస్ శాఖని అభినందిస్తున్నానన్నారు.