అమ్మమ్మను హతమార్చిన మనవడు
KMM: అమ్మమ్మను మనవడు హత్య చేసిన సంఘటన శుక్రవారం ఎర్రుపాలెం మండల పరిధిలోని సకినివీడు గ్రామంలో చోటు చేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన శాఖమూరి పద్మ(60) నిద్రిస్తున్న సమయంలో మనవడు చీరాల సాయి హతమార్చినట్లు తెలిపారు. పోలీసులు ఘటన స్థలాన్ని పరిశీలించి దర్యాప్తు చేస్తున్నారు. ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.