మానవత్వం చాటుకున్న అభిమన్యు గ్రూప్ సభ్యులు
ADB: ఉట్నూర్ మండలంలోని రాంజీగోండ్ నగరుకు చెందిన ఆత్రం గంగూబాయి ఇటీవల చిన్నారిని జనమిచ్చి మరణించింది. ఈమె భర్త గత కొన్ని నెలల క్రితమే చనిపోగా.. పిల్లలు అనాథలయ్యారు. దీంతో అభిమన్యు గ్రూప్ సభ్యులు కలిసి వారికి రూ. 90,500 నగదును అందజేశారు. పేదలకు అండగా ఉంటామని హమిచ్చారు. కార్యక్రమంలో మెస్రం శేఖర్, తిరుమతి, లింగు, నాగబాయి, ఇందిరా తదితరులు పాల్గొన్నారు.