లారీ ఢీకొని ఇద్దరు బస్సు డైవర్లు మృతి
NLG: నార్కట్ పల్లి సమీపంలో HYD-VJWD నేషనల్ హైవేపై NLG ఎక్స్ రోడ్ ఫ్లై ఓవర్ వద్ద ఇవాళ ఘోర ప్రమాదం జరిగింది. ఓ ట్రావెల్స్ బస్సు, లారీని ఓవర్ టేక్ చేసి ముందుకెళ్లే క్రమంలో లారీకి తాకింది. దీంతో లారీ డ్రైవర్ బస్సును ఆపి రోడ్డుపై ఘర్షణకు దిగాడు. బస్సు, లారీ డ్రైవర్ల మధ్య వాగ్వాదం జరుగుతుండగా.. వేగంగా వచ్చిన మరో లారీ ఆగి ఉన్న లారీని ఢీ కొట్టింది. రెండు లారీల మధ్య చిక్కుకుని డ్రైవర్లు మరణించారు.